రాగం : హిందోళం
తాళం : ఆది
20 నతభైరవి జన్య
ఆ : స గ2 మ1 ద1 ని2 స
అవ : స ని2 ద1 మ1 గ2 స
Composer: Annamaachaarya
Language: Telugu
పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
(కొండ)
చరణం 1:
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు
(కొండ)
చరణం 2:
కంచిలోనుండ తిరుకచ్చి నంబి మీద
కరుణించి తన యెదకు రప్పించిన వాడు
యెంచ ఎప్పుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరునపాలించిన వాడు
(కొండ)
Lyrics taken from following site for transliteration:
http://aumsri.sulekha.com/blog/post/2007/07/kondalalo-nelakonna-by-sri-annamaacharya.htm
Thursday, December 18, 2008
Subscribe to:
Comments (Atom)